27-04-2025 07:56:02 PM
నూతన ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి గ్రామ కమిటీల ఏర్పాటులో యువత భాగస్వాములు కావాలని పిలుపు..
ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి భద్రాచలం నియోజకవర్గం ఇన్చార్జి చెంగల గురునాథం మాదిగ..
చర్ల (విజయక్రాంతి): చర్ల మండలం అంబేద్కర్ నగర్ ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం అలవాల సతీష్ మాదిగ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ముఖ్యఅతిథిగా భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జ్ చెంగల గురునాథ మాదిగ పాల్గొని మాట్లాడుతూ... మహాజన మందకృష్ణ మాదిగ పిలుపులో భాగంగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాల నూతన గ్రామ కమిటీల నిర్మాణంలో భాగంగా చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండల పరిధిలోని గ్రామ, మండల కమిటీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
నూతన గ్రామ కమిటీల ఏర్పాటుకు సిద్ధం చేస్తున్నామన్నారు. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండల పరిధిలోని ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నూతన నిర్మాణంలో చైతన్యవంతమైన యువ నాయకత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి సీనియర్ నాయకులు కొప్పుల తిరుపతి మాదిగ, అలవాల పెరియర్ రాజా మాదిగ, నల్లగట్ల వెంకన్న మాదిగ, ఎంఎంఎస్ జిల్లా నాయకులు మేకల లత, గ్రామస్తులు అలవాల చంద్రయ్య మాదిగ, వరికిల్ల రమణయ్య మాదిగ, కోర్రజు ల సుక్కయ్య మాదిగ, అలవల సత్యవతి చెన్నం సోమ నవీన తదితరులు పాల్గొన్నారు.