calender_icon.png 20 March, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందకృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన ఎమ్మార్పీఎస్ మండల నాయకులు

19-03-2025 11:06:29 PM

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో బుధవారం చట్టం చేసిన సందర్భంగా బుధవారం మునగాల మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఎం.ఎస్. పి.మండల అధ్యక్షులు గుడిపాటి కనకయ్య మాదిగ, లంజపల్లి శ్రీను మాదిగల ఆధ్వర్యంలో డప్పులతో ర్యాలీ నిర్వహించి, అనంతరం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం మాదిగ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పిస్తూ, టపాకాయలు పేల్చి స్వీట్లు పంచడం జరిగింది. 

ఈ సందర్భంగా వర్గీకరణ చట్టం అసెంబ్లీలో ఆమోదించబడిన సందర్భంగా సంబరాలు చేసుకున్న అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎం.ఎస్.పి. జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అంజయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాతకోట్ల నాగరాజు మాదిగలు మాట్లాడుతూ... మాదిగల మండే గుండె చప్పుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ  ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్రంలో గడచిన 30 సంవత్సరాలుగా ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారని ఇట్టి పోరాటంలో ఎన్నో అవమానాలు ఎన్నో ఆటుపోట్లు ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొని గమ్యాన్ని ముద్దాడని అంతేకాకుండా, ఈ ఉద్యమంలో అమరులు అయినా మాదిగ అమరవీరులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామని తెలిపారు.

అంతేకాకుండా ఒక జాతి ఉద్యమమే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రకుల మైనార్టీ సబ్బండ వర్గాల కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నాడని అందుకు ఉదాహరణ వికలాంగుల పెన్షన్ల పెంపు కోసం రేషన్ బియ్యం కోట పెంపుదల కోసం వృద్ధుల వితంతుల పెన్షన్ల కోసం పోరాటం చేసి విజయాలు సాధించిన చరిత్ర గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగకి ఘనత తక్కుతుందని వారు తెలిపారు. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలో గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారులందరినీ ఏకం చేసి ఆనాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డితో కొట్లాడి ఆపరేషన్లు చేయించడం జరిగిందని దానికి స్ఫూర్తి ఆరోగ్య శ్రీ పథకం అని ఆనాటి ముఖ్యమంత్రి నిండు శాసనసభలో తెలపడం మాదిగ జాతికే గర్వకారణం అని ఇలాంటి ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసిన ఘనత పద్మశ్రీ మందకృష్ణ మాదిగకి దక్కుతుందన్నారు. గడిచిన 30 సంవత్సరాల కల నెరవేరిన సందర్భంగా మండలో ఉన్న గ్రామాలలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నాయకులు కార్యకర్తలు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బానిసంచ కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు గుడిపాటి కనకయ్య మాదిగ, ఎం.ఎస్.పి. మండల అధ్యక్షులు లంజపల్లి శ్రీను మాదిగ, మండల ఉపాధ్యక్షులు గద్దల అశోక్ మాదిగ, మాజీ మండల ఉపాధ్యక్షులు ములుగూరి వెంకటేశ్వర్లు, ఎమ్మార్పీఎస్ రేపాల గ్రామశాఖ అధ్యక్షులు మెరుగు వెంకటేశ్వర్లు, ఎమ్మార్పీఎస్ సీతానగరం గ్రామశాఖ అధ్యక్షులు పుల్లూరి వెంకటేశ్వర్లు, కలకోవ గ్రామ శాఖ ఎమ్మార్పీఎస్ కోశాధికారి పాతకోట్ల విక్రమ్, చిర్రా వివేక్, తదితరులు పాల్గొన్నారు.