calender_icon.png 12 March, 2025 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్ 1 ఫలితాలను నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్ దీక్షలు

12-03-2025 12:00:00 AM

భీమదేవరపల్లి, మార్చి 11: గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్3  ఫలితాలను వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్, ఎం ఎస్పి ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ము ల్కనూరులో నిరసన దీక్షలు చేపట్టారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్ పరీక్షల ఫలితాలు ని లుపుదల చేయాలని డిమాండ్ చే స్తూ నిరసన దీక్షలు చేపట్టినట్లు ఎ మ్మార్పీఎస్ నాయకులు మాట్ల వెంకటస్వామి పేర్కొన్నారు.

ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు అయ్యేంతవరకు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఫలితాలను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఎంఆర్పిఎస్ నిరసన దీక్షకు తెలంగాణ జేఏసీ చైర్మన్ డేగల సారయ్య, టిఆర్‌ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు మండల సురేందర్ , తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెట్యాల ప్రకాష్ నిరసన దీక్షకు మద్దతు తెలిపారు.

నిరసన దీక్షలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కడారి ప్రభాస్ రాష్ట్ర నాయకులు రేణిగుంట్ల బిక్షపతి ,మండల అధ్యక్షురాలు వేల్పుల పాపక్క ఐలపాక స్వామి ,తాడూరి చిరంజీవి, మట్టెడ లింగయ్య, బహుజన నాయకులు తూముల స్వామి, గడిపే అరుణ్ కుమార్ తదితరులు నిరసన దీక్షకు మద్దతు పలికారు.