calender_icon.png 15 January, 2025 | 10:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుష్కర ఘాట్ నందు స్థల పరిశీలన

05-09-2024 09:05:52 PM

అలంపూర్,(విజయక్రాంతి): అలంపూర్ లోని జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల దర్శనానికి వచ్చే భక్తులకు తుంగభద్ర నది సమీపంలో దుస్తులు మార్చుకునేందుకు అలాగే మరుగుదొడ్ల సముదాయ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మార్వో మంజుల, ఆలయ ఈవో పురేందర్ కుమార్ స్థల పరిశీలన చేశారు. ఈ మేరకు గురువారం పుష్కర ఘాట్  సందర్శించి ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందోనని పరిశీలించారు.

జోగులాంబ ను దర్శించుకున్న డిసిసిబి చైర్మన్ 

ప్రముఖ శైవ క్షేత్రం జోగులాంబ మాత దేవి ఆలయాలను మహబూబ్ నగర్ డిసిసిబి చైర్మన్  మామిళ్ళ విష్ణువర్ధన్ రెడ్డి గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి సాదర స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి వెంట నాయకులు ఈర్లదిన్నె రంగారెడ్డి    పిఏసి ఎస్ ఆయా మండలాల అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి గజేందర్ రెడ్డి, కేశవరెడ్డి  తదితరులు ఉన్నారు