01-03-2025 12:00:00 AM
విభిన్నమైన సబ్జెక్టులు ఎంచుకుంటూ యూనిక్ సినిమాలతో ప్రేక్షలకు వినోదం పంచుతున్నాడు హీరో శ్రీవిష్ణు పుట్టినరోజు శుక్రవారం. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమాలకు సంబంధించి ఆసక్తికరమైన అప్‌డేట్స్ వచ్చాయి. శ్రీవిష్ణు ‘మృత్యుంజయ్’ అనే మరో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో అలరించబోతున్నాడు. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టై న్‌మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మిస్తున్నారు.
రెబా జాన్ హీరోయిన్. ‘సామజవరగమన’ తర్వాత శ్రీవిష్ణు, రెబా జాన్ కలయికలో రాబోతున్న చిత్రమిది. శుక్రవారం ఈ మూవీ టైటిల్ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీజర్‌లో వాయిస్ ఓవర్‌లో ‘గేమ్ ఓవర్ జయ్’ అని వినిపిస్తోంది. ఇందులో శ్రీవిష్ణును ఇన్వెస్టిగేటర్‌గా, ఖైదీగా చూపించారు.
చివర్లో ‘నేను చెప్పే వరకు గేమ్ ఫినిష్ కాదు’ అంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
ఐదు టైర్ల బైక్ రైడ్‌లో బ్రేకుల్లేవ్.. నవ్వులే!
కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాన్ని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జీ నిర్మిస్తారు. శుక్రవారం విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. హీరోహోండా సీడీ100 బైక్ ఐదు టైర్లతో ప్రజెంట్ చేయడం ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది.
‘క్రేజీ రైడ్ కోసం రండి బ్రేక్‌లు లేవు, నవ్వులు మాత్రమే!’ అనే కోట్ సినిమా ఎలా ఉండబోతోందో తెలుస్తోంది. ఒంగోలు పట్టణం నేపథ్యంలో సాగే ఈ కథలో శ్రీవిష్ణు హిలేరియస్ క్యారెక్టర్‌తో మెప్పిస్తారని మేకర్స్ పేర్కొన్నారు. సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, ప్రమోదిని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు డీవోపీ: సాయిశ్రీరామ్; సంగీతం: రధన్.