26-02-2025 12:13:31 AM
ఆర్య, గౌతమ్ కార్తీక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ ఎక్స్’. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు.
భారతదేశ గూడచర్య వీరుల జీవితాల గురించి.. వారి త్యాగాల ఆధారంగా ఇంటెన్స్ యాక్షన్-ప్యాక్డ్ కథనాన్ని ఈ సినిమా అందిస్తోందని టీజర్ ద్వారా తెలుస్తోంది. ఇందులో అతుల్య రవి, రైజా విల్సన్, అనఘ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ టీజర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో కట్ చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్-ఇండియా చిత్రంగా విడుదల కానుంది.