calender_icon.png 23 October, 2024 | 5:02 AM

పంద్రాగస్టుకు మిస్టర్ బచ్చన్.. 14న ప్రీమియర్స్

22-07-2024 02:32:00 AM

రవితేజ, హరీష్ శంకర్ కలయికలో రానున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఆగస్ట్టు 15న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మేరకు  నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటిస్తూ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. కాగా ఈ సినిమా ప్రీమియర్ షోలు ఆగస్టు 14న ప్రదర్శితం కానున్నాయి. అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప: ది రైజ్’ సినిమా వాయి దా పడటంతో ఆ వారంలో విడుదల రోజైన 15వ తేదీ నుంచి రాఖీ పండగ (ఆగస్టు 19) వరకు సెలవు దినాలు కలిసి వస్తాయన్న ఆలోచనతో పలువురు చిత్ర నిర్మాతలు ఈ తేదీనే తమ సినిమాలకు అనువైనదని భావించి ఖాయం చేసుకున్నారు. రామ్ నటించిన ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంతో పాటు ఇప్పటికే ‘ఆయ్’, ‘35  చిన్న కథ కాదు’ సినిమాలు పంద్రాగస్టు బరిలో ఉండగా.. మిస్టర్‌బచ్చన్ తాజాగా ఈ జాబితాలో చేరింది. అదే రోజున విక్రమ్ కథానాయకుడిగా రూపొందిన ‘తంగలాన్’ అనువాద రూపంలో రానుంది.