calender_icon.png 19 January, 2025 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మిస్టర్ బచ్చన్’ ధమాకా ప్లస్‌లా ఉంటుంది

11-08-2024 12:07:07 AM

హీరో రవితేజ, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఇదే నెల 15న విడుదల కానుం ది. ఈ నేపథ్యంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ శనివారం విలేకరులతో సినిమా విశేషా లను పంచుకున్నారు. ‘-‘రవితేజతో సిరీస్ ఆఫ్ మూవీస్ చేస్తాం. హరీశ్ శంకర్‌తో కొంతకాలం గా ట్రావెల్ అవుతున్నాం. వీళ్లిద్దరిదీ వెరీ క్రేజీ కాంబినేషన్. ఎంటర్‌టైన్‌మెంట్, మాస్, యాక్షన్ ఎపిసోడ్స్ పరంగా ‘మిస్టర్ బచ్చన్’ ధమాకా ప్లస్‌లా ఉంటుంది. సినిమా స్టార్ట్ చేసినప్పుడే మే, జూన్‌లోగా పూర్తి చేయాలనేది ప్లాన్.

వాస్తవానికి ఆగస్టు 9 రిలీజ్ డేట్ అనుకున్నాం. అయితే మా సాంగ్స్ షూటింగ్ పూర్తి కాలేదు. మరోవైపు పుష్ప స్లాట్ క్లియర్ అవ్వడంతో ఆగస్టు 15 ది బెస్ట్ అనుకున్నాం. ఆ రోజు రెండు పెద్ద సినిమాలు ‘మిస్టర్ బచ్చన్’, ‘డబుల్ ఇస్మార్ట్’ ఉన్నాయి. ఈ రెండింటికీ లాంగ్ వీకెండ్ ప్లస్ అవుతుంది. బచ్చన్ సినిమా అనుకున్న బడ్జెట్‌లోనే అయ్యింది. కొత్త అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకోవాలని డైరెక్టర్ నిర్ణయించారు. భాగ్యశ్రీ బోర్సే చాలా చక్కగా పెర్ఫార్ చేశారు. రవితేజతో ఇన్ని సినిమాలు అని ఏమీ అనుకోలేదు కానీ, ఆయనతో కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉంటా. 

హాలీవుడ్‌ను దగ్గరగా పరిశీలించిన నేను అక్కడి టెక్నాలజీ ఇక్కడికి తీసుకురావాలనే ఆలోచనతో ఇప్పటికే కొంత అడాప్ట్ చేశాం. ఇప్పుడు మా సినిమాలు 15 రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. వచ్చే ఏడాది కూడా మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే దాదాపు 10 సినిమాలు విడుదల చేస్తున్నాం. అలా రెండు మూడేళ్లు ఈ లైనప్ ఉంటుంది. కచ్చితంగా ‘మిస్టర్ బచ్చన్’ ప్రీమియర్స్ ఉంటాయి.