25-03-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, మార్చి 24: పార్లమెంటు సభ్యులకు ప్రతినెలా వేతనాలు, పెన్షన్లను కేంద్ర ప్రభుత్వం పెంచింది. పార్లమెంటు సభ్యుల వేతనాలను 24శాతం మేర పెంచుతూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సోమవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇప్పటి వరకు నెలనెలా వేతనంగా రూ.లక్ష అందుకున్న పార్లమెంటు సభ్యులు ఇకపై రూ.1.24లక్షలను జీతంగా తీసుకోను న్నారు.
అలాగే రోజు వారీ భత్యంగా రూ.2 వేలు అందుకున్న సిట్టింగ్ ఎంపీలు ఇక పై రూ.2,500 భత్యంగా తీసుకో నున్నారు. ఈ క్రమంలోనే మాజీ పార్లమెంట్ సభ్యుల పెన్ష న్ రూ.25వేల నుంచి రూ.31వేలకు పెరిగిం ది. వీటికి అదనంగా ఏటా మొబైల్, ఇంట ర్నెట్‌కు సంబంధించిన అలవెన్సులను ఎంపీ లు పొందనున్నారు. పెంచిన ఈ వేతనాలు ఏప్రిల్ 1, 2023 నుంచి వర్తింపజేయనున్న ట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.