23-02-2025 04:58:51 PM
కొత్తగూడెం (విజయక్రాంతి): లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ కాంప్లెక్స్ లెవెల్ లో బాలమేళ కార్యక్రమంలో భాగంగా, కాంప్లెక్స్ హెచ్ఎం ప్రతి పాఠశాలకు వెళ్లి ఆ పాఠశాల రికార్డ్స్, పాఠశాల పరిసరాలు అక్కడ పిల్లల సామర్థ్యాలను పరీక్షించగా 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఎంపీపీఎస్ ఉయ్యాల బాడవ పాఠశాల నుండి విద్యార్థులు, రాష్ట్రాలు, వాటి రాజధానులు వారు మాట్లాడే భాషతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల పేర్లు, జిల్లాలోని అన్ని మండలాల పేర్లు, మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పేర్లు, ఇలా దేశం నుండి మండలం వరకు వివిధ హోదాలో పనిచేస్తున్న వారి పేర్లతో పాటుగా, అత్యవసర సర్వీసులైన అన్ని టోల్ ఫ్రీ నెంబర్లు వాటి యొక్క ప్రాధాన్యతను తెలియజేసారు.
అదేవిధంగా ప్రతి ఒక్కరూ వేమన పద్యాలు, తాత్పర్యం జిల్లాలో కలెక్టర్ ప్రవేశపెట్టిన 100 డేస్ ప్రోగ్రామ్స్ తదితర విషయాలపై రాత అంశాలను పరిశీలించి కాంప్లెక్స్ లోనే బెస్ట్ స్కూల్ గా ఉయ్యాల బడవ ప్రశంసా పత్రంతో పాటు మెమొంటో శాలువాతో, ఇరువురు ఉపాధ్యాయులును, పాయం ఆనందరావు (ఏటీఎఫ్ జిల్లా అధ్యక్షులు) బానోత్ రాములు నాయక్ (టీఎస్ టిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) లను జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఏ. నాగ రాజశేఖర్, మండల విద్యాశాఖ అధికారి, కాంప్లెక్స్ హెచ్ఎం పి.కృష్ణయ్య, మైలారం కాంప్లెస్ హెచ్ఎం రాజమౌళి, లక్ష్మీదేవి పల్లి హై స్కూల్ హెచ్ఎం కొండలరావు, కాంప్లెక్స్ పరిధిలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు పిల్లలు కలిసి వారికి బెస్ట్ స్కూల్ అవార్డు ప్రధానం చేశారు. అనంతరం ఎఫ్ఎల్ఎన్ టిఎల్ఎం బాలమేళాలో ఈవిధ అంశాలలో పిల్లల సామర్థ్యాలను పరీక్షించి, గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది.