సన్మానంలో సత్యసాయి బాబా దేవాలయ కన్వీనర్ గంగ రాధా కిషన్
మంథని, (విజయక్రాంతి): ఎంపీపీ పదవీకే కొండ శంకర్ వన్నే తెచ్చారని శ్రీ సత్యసాయి బాబా దేవాలయ కన్వీనర్ శ్రీ గంగ రాధా కిషన్, శ్రీ అష్టధాని గంగాధర్ లు అన్నారు. బుధవారం మంథనిలోని సత్యసాయి బాబా దేవాలయంలో తాజా మాజీ ఎంపీపీ కొండా శంకర్ ను శాలువాతో ఘనంగా సన్మానం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఐదు సంవత్సరాలు పదవీ కాల పరిమితి విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మంథని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆత్మీయ సన్మాన అభినందన సభ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీపీ కొండా శంకర్ ప్రజాప్రతినిధులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులు, మరియు వారి అభిమానులు మెమొంటో, పూల మాలలతో, శాలువాలతో ఘనంగా సన్మానించినారు.
ప్రజలకు అందుబాటులో ఉండి ఎంతో ఓపిక, పట్టుదల, కృషితో ఎన్నో సమస్యలను పరిష్కరించారని గుర్తుచేశారు. శ్రీ సత్య సాయి బాబా వారి దేవాలయం మెంబర్ గా 25 సంవత్సరాల సుదీర్ఘ ,సంబంధం మాతో కలిగిన వ్యక్తి కొండ శంకర్ అని కొనియాడారు. వారి తండ్రి కొండ మల్లయ్య మాకు 50 సంవత్సరాల నుండి అనుబంధం, పరిచయం కొనసాగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వారు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి మంచి పేరుతో జీవించిన వ్యక్తిగా మాకు తెలుసన్నారు. శంకర్ మంచి పౌల్ట్రీ, వ్యవసాయ రైతుగా కష్టపడ్డ వ్యక్తిగా మాకు తెలుసునని అన్నారు. 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఎన్నో పదవులు చేపట్టి పదవులకే వన్నె తెచ్చే విధంగా పనిచేశారని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో రామడుగు మారుతీ రావు, రాజమౌళి గౌడ్, గుర్రం నరసింహారావు, రేపాల శ్రీనివాస్, గంప శ్రీనివాస్, శారదమ్మ, పాల్గొన్నారు. అనంతరం స్వీట్లు హలహరాలు స్వీకరించారు.