calender_icon.png 1 March, 2025 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి ఎద్దడి తీరుపై ఎంపీవో పరిశీలన

01-03-2025 12:21:09 AM

పిట్లం ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని రాంపూర్ (కలాన్)  గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, నర్సరీ, కంపోస్టు షెడ్డు, గ్రామంలోని మంచినీటి మోటా రులను పిట్లం మండల ఇన్చార్జి ఎంపీఓ, గ్రామ స్పెషల్ ఆఫీసర్ రాము శుక్రవారం పరిశీలించారు.

అనంతరం గ్రామపంచా యతీ రికార్డులను తనిఖీ చేసి, ప్రజలకు నీటి ఇబ్బంది లేకుండా చూడాలని, మిషన్ భగీరథ నీటిని అన్ని ట్యాంకులలో నింపే విధంగా చర్యలు తీసుకోవాలని, వేసవికాలం దృష్ట్యా నీటి కొరత రాకుండా, గ్రామ ప్రజ లు నీటిని వృధా చేయకుండా అరికట్టాలని గ్రామపంచాయతీ కార్యదర్శి భాస్కర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి భాస్కర్, గ్రామ పంచాయతీ కారోబార్ కృష్ణ, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.