calender_icon.png 8 January, 2025 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీఎల్ టీ షర్ట్‌లను విడుదల చేసిన అంజనీపుత్ర యాజమాన్యం

07-01-2025 11:41:25 PM

మంచిర్యాల (విజయక్రాంతి): ఐపీఎల్ తరహాలో మంచిర్యాల జిల్లాలో గురూస్ అకాడమీ నిర్వహిస్తున్న మంచిర్యాల ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్)  టీ షర్ట్‌లను అంజనీ పుత్ర యాజమాన్యం మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా అంజనీపుత్ర చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవిలు మాట్లాడుతూ.. ఈ నెల 8 నుంచి శివాజీ గ్రౌండ్స్‌లో ప్రారంభమవుతున్న క్రికెట్ పోటీలు ఈ నెల 16 వరకు జరుగనున్నాయని, క్రీడాకారులు పోరాట ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ సభ్యులు, అంజనీ పుత్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.