calender_icon.png 15 November, 2024 | 7:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటింటి సర్వే ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీడీఓ యాదగిరి

13-11-2024 05:23:01 PM

జగదేవపూర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా బుధవారం మండల కేంద్రంతో పాటు మునిగడప, తీగుల్ గ్రామాల్లో చేపట్టిన సర్వేను జగదేవపూర్ ఎంపీడీఓ బి.యాదగిరి పరిశీలించారు. ఈ సందర్భగా వారు మాట్లాడుతూ.. ఫారంలో ఇచ్చిన అన్ని కాలాలను తప్పులు లేకుండా నింపాలని, ప్రభుత్వము సూచించిన నిబంధనల ప్రకారం గ్రామాల్లో సర్వే నిర్వహించాలని, ప్రతి కుటుంబం యొక్క సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కులం, రాజకీయ నేపథ్య వివరాలు అడిగి తెలుసుకుని మాత్రమే నమోదు చేయాలి గాని, ఎన్యుమారెటర్ వ్యక్తి గత జోక్యం చేసుకోరాదు అన్నారు.

అనంతరం తీగుల్ గ్రామంలో నిర్వహించిన 2024-25 ఉపాధి హామి పనుల గుర్తింపు గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టే తోటల పెంపకం, ఫాం ఫండ్ ల ఏర్పాటు రైతుల పంట పొలాలకు వెళ్ళే మట్టి రోడ్లను అభివృద్ది చేసుకోవడం లాంటి పనులను గుర్తించి రైతుల నుండి దరఖాస్తులు తీసుకోవాలని అన్నారు. గ్రామంలోని రైతులు ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తదనంతరం తీగుల్ గ్రామంలో అంగన్ వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషకాహార దినోత్సవంలో పాల్గొని పిల్లలకు సరైన పౌష్టికారాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయితీ అధికారి ఎండీ ఖాజా మోహినోద్దీన్, పంచాయతీ కార్యదర్శులు రామ్ రెడ్డి, హరీష్ కుమార్, నరేందర్, ఉపాధి హామి సిబ్బంది బాబు, ఆంగన్ వాడీ టీచర్, ఎనుమారెటర్స్, తదితరులు పాల్గొన్నారు.