calender_icon.png 19 March, 2025 | 1:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎడ్ల చంద్రమ్మ ఇంటికి ఎంపీడీవో

19-03-2025 12:00:00 AM

తుంగతుర్తి, మార్చి 18: తుంగతూర్తి నియోజకవర్గం వెలుగుపల్లి గ్రామానికి చెందిన వృద్దురాలు ఎడ్ల చంద్రమ్మకు పించను రావడం లేదని,  95సంవత్సరాల వయసు.. పింఛన్ రాకపోయే అనే శీర్షికను విజయక్రాంతి దినపత్రికలో ప్రచురితమైనా కథనానికి అధికారులు స్పందించారు.  స్థానిక ఎంపీడీవో శేషు కుమార్,  కార్యదర్శిలు మంగళవారం ఆమె ఇంటికి వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

2015 సంవత్సరంలోనే ఆమెకు పింఛను మంజూరైనదని, ఆ సంవత్సరంలో వరుసగా మూడు నెలలు ఆమె పింఛన్ తీసుకోకపోవడంతో  పింఛన్ ఆగిపోయినదని తెలుసుకున్నారు. జిల్లా అధికారులకు నివేదిక పంపి సమస్యను పరిష్కరించి పించను వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా  జరిగిన సంఘటన మొదటిసారిగా విజయక్రాంతి దినపత్రికలో ప్రచురిత కావడం, అధికారులు స్పందించడంతో  గ్రామస్తులు, కుటుంబ సభ్యులు విజయక్రాంతిను అభినందించారు