అనంతగిరి,(విజయక్రాంతి): మండల పరిధిలోని ఖానాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల ఎంపీడీవో సుష్మ బుధవారం పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో సుష్మ మాట్లాడుతూ... ప్రభుత్వం వినియోగించే కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్ధారించిన తేమశాతం ప్రకారం రైతులు అమ్మకం చేయాలన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం అమ్మకం చేసి బోనస్ పొందాలని అన్నారు వరి ధాన్యాన్ని చివరి వరకు కొనుగోలు చేస్తుందన్నారు. కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు. తూకం వేసిన బస్తాలను వెంటనే మిల్లులకు తరలించాలని చెప్పారు. కొనుగోలు సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవాలన్నారు. నిర్వాహకులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే రైతులు ధాన్యం నిక్రయించాలని కోరారు.