04-03-2025 11:57:00 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాల (సిఓఈ) లో సోమవారం రాత్రి బెల్లంపల్లి ఎంపీడీవో మహేందర్ విద్యార్థులతో కలిసి హాస్టల్ నిద్ర చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. కళాశాలలో విద్యార్థులకు అందుతున్న బోధన సౌకర్యాలను అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.