13-03-2025 07:07:15 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బోర్లం గ్రామంలో గురువారం జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం బోర్లంలోని టీజీఎంఆర్ఎస్&జేసీ గురుకుల పాఠశాలలోని నిలువ ఉంచిన కూరగాయలను, ఆహారంను, విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలను గురించి తనిఖీ చేయడం జరిగింది. విద్యార్థులకు వారి యొక్క నూతన మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని తెలుసుకోవడం జరిగింది గురుకుల ప్రిన్సిపాల్ కు పలు సూచనలు చేయడం జరిగింది. ఎంపీడీవో షర్ఫుద్దీన్ హాస్టల్ వార్డెన్ విద్యార్థులు పాల్గొన్నారు.