27-03-2025 01:21:15 PM
బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచుల నిరసన
కాగజ్‌నగర్,(విజయక్రాంతి): తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు(Pending bills) వెంటనే చెల్లించాలని కోరుతూ... కాగజ్ నగర్ ఎంపీడీవో కార్యాలయానికి(Kagaznagar MPDO Office) తాళం వేసి ఆందోళన చేపట్టారు. తమ హయాంలో చేపట్టిన మన ఊరు మన బడి,అంతర్గత రహదారులు, పల్లె ప్రకృతి వనాలు, స్మశాన వాటికల అభివృద్ధి పనులు చేపట్టిన తమకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు నాలుగు కోట్ల రూపాయల బిల్లులు రావాల్సి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ అభివృద్ధి(Panchayat development) పనుల కోసం తమ వ్యక్తిగత ఆస్థులు అమ్మి, అప్పు చేసి నిధులు సమకూర్చుకున్నామని ఇప్పుడు తమకు బిల్లులు చెల్లించనట్లైతే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం రెండు వందల కోట్లతో చేపట్టే అందాల పోటీలు ఆపి తమకు రావాల్సిన బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం స్పందించి బిల్లులు చెల్లించాలని, లేదంటే ఆందోళన మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.