calender_icon.png 27 November, 2024 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీడీవో ఆఫీసుసుకు తాళం

27-11-2024 12:56:19 AM

  1. 20 నెలలుగా  కిరాయి ఇవ్వని అధికారులు 
  2. ఆగ్రహంతో తాళం వేసిన భవన యజమాని

వనపర్తి, నవంబర్ 26 (విజయక్రాంతి): వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీగా మారినా ఎంపీడీవో కార్యాలయం అద్దె భవనంలోనే కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో గడిచిన 20 నెలల నుంచి కిరాయి చెల్లించలేదంటూ భవన యజమాని సురేందర్ మం గళవారం కార్యాలయానికి తాళం వేశాడు.

ఎంపీడీవో శ్రీనివాస్ గత నెల రూ.లక్ష 40 వేల చెక్కు ఇచ్చినప్పటికీ ఆ చెక్కు తీసుకుని బ్యాంక్‌కు వెళ్తే ట్రెజరీలో డబ్బులు లేవని చెప్పారని పేర్కొన్నాడు. దీంతో విసుగుచెంది కార్యాలయానికి తాళం వేసినట్టు సురేందర్ తెలిపాడు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, 20 రోజుల్లో అద్దె చెల్లిస్తామని ఎంపీడీవో శ్రీనివాస్ హామీ ఇవ్వడంతో సురేందర్ తాళం తెరిచాడు.