calender_icon.png 19 April, 2025 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో ఎంపీడీఓ భోజనం

16-04-2025 10:06:17 PM

ఆదర్శంగా నిలుస్తున్న ప్రభుత్వ అధికారి..

మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద బడుగు బలహీన వర్గాలకు కడుపునిండా భోజనం అందించేందుకు సన్న బియ్యం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టగా అధికారులు క్షేత్రస్థాయిలో పథకం తీరును ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. దీనిలో భాగంగా మండల పరిషత్ అభివృద్ది అధికారి ఎన్ రాజేశ్వర్ మండలంలోని సారంగపల్లి గ్రామానికి చెందిన సన్న బియ్యం లబ్ధిదారురాలు రేశవేన లింగయ్య దంపతుల ఇంట్లో సన్నబియ్యంతో చేసిన వంటను బుదవారం రుచి చూశారు.

ఈ సందర్బంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు పంపిణీ చేసిన సన్నబియ్యంతో చేసిన వంటను రుచి చూశారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ  మాట్లాడుతూ... ప్రభుత్వం ధనవంతులు తినే సన్నబియ్యంను నిరుపేదల కడుపు నింపాలనే ఆశయంతో రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం సరఫరా చేస్తుందని ఆన్నారు. కార్డుదారులు సకలంలో చౌక ధరల దుకాణం వెళ్లి బియ్యం తీసుకొని సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా మండల అదికారులు తమ ఇంటికి వచ్చి భోజనం చేయడం పట్ల లబ్ధిదారుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చంద్రకళ, నాయకులు తాజుద్దీన్ పాల్గొన్నారు.