27-02-2025 10:11:08 PM
బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలం సారపాక బస్టాండ్ మరియు సంత ప్రాంతంలో పబ్లిక్ టాయిలెట్స్ లేక స్త్రీలు, వృద్ధులు, ప్రయాణికులు స్థానికులు నానా అవస్థ పడుతున్న నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం కోసం ఎంపీడీవో జమలారెడ్డి గురువారం స్థల పరిశీలన చేశారు. వారితో పాటు పంచాయతీ సెక్రటరీ మహేష్ తదితరులు ఉన్నారు.