calender_icon.png 21 March, 2025 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి పనులను పరిశీలించిన ఎంపీడీఓ

20-03-2025 05:35:17 PM

మందమర్రి (విజయక్రాంతి): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎన్ రాజేశ్వర్ పరిశీలించారు. మండలంలోని ఆదిలిపేట పొన్నారం గ్రామపంచాయతీ పరిధిలో కొనసాగుతున్న చేపట్టిన ఉపాధి హామీ పథకం పనులను గురువారం పరిశీలించారు. పని స్థలాల్లో వేసేవి రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు కూలీలకు సరైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న కుంటను పరిశీలించారు. అనంతరం  చేల్లకు వెళ్ళే రోడ్డు మొరం పనులను ప్రారంభించారు. ఆయన వెంట టిఏ రాజమల్లు, ఫీల్డ్ అసిస్టెంట్ ఈద లింగయ్య, కాంగ్రెస్ నాయకులు  మాసు సంతోష్ కుమార్ పెంచాల రాజలింగులు పాల్గొన్నారు.