calender_icon.png 20 April, 2025 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ రోడ్డు పనులను పరిశీలించిన ఎంపీడీవో

05-04-2025 04:37:04 PM

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలోని మీసన్ పల్లి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన సిసి నిర్మాణ పనులను శనివారం ఎల్లారెడ్డి ఎంపీడీవో ప్రకాష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ... మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా విడుదలైన నిధులతో మీసంపల్లి గ్రామాల్లో సిసి రోడ్డు పనుల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. గ్రామంలో నాణ్యత లోపం లేకుండా సీసీ రోడ్డు నిర్మాణ పనులను త్వరతగతిన పూర్తి చేయాలన్నారు. స్థానికులకు అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.