13-03-2025 09:58:15 PM
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలను(Minority Boys Gurukul School) గురువారం ఎల్లారెడ్డి ఎంపీడీవో ప్రకాష్(Yellareddy MPDO Prakash) తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలోని వంటశాల, డైనింగ్ హాల్, వసతిగృహంలోని గదులు బాత్రూంలను క్షుణ్ణంగా పరిశీలించారు. గురుకుల పాఠశాల సముదాయాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు పాఠశాల సిబ్బందికి సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.వ్యక్తిగత శుభ్రత పాటించి ఆరోగ్యంగా ఉండాలని పేర్కొన్నారు. రాబోయే పరీక్షలకు ప్రణాళిక బద్ధంగా చదువుకొని, మంచి ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు గొప్ప కీర్తి ప్రతిష్టలను తేవాలని ఆకాంక్షించారు.