calender_icon.png 27 February, 2025 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎంపిడిఓ

18-02-2025 06:19:55 PM

కామారెడ్డి (విజయక్రాంతి): నర్సరీ, అవెన్యూ ప్లాంటేషన్ లో మొక్కలు ఎండిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. మండలంలోని గొట్టిముకుల గ్రామంలో నర్సరీ, అవెన్యూ ప్లాంటేషన్ లను పరిశీలించారు. అనంతరం గ్రామంలో కొనసాగుతున్న ఉఫాధి హామీ పనులను పరిశీలించారు. కూలీల హాజరు ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలని తెలిపారు. అదే విధంగా గ్రామంలోని అంగన్ వాడి కేంద్రాన్ని తనిఖీ చేసి పిల్లకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. గర్భిణీ, బాలింతలకు క్రమం తప్పకుండ సెంటర్ కు వచ్చి పౌష్టికాహారం తీసుకునే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, టిఏ లింగం, ఎఫ్ ఏ అంజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.