calender_icon.png 21 January, 2025 | 12:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముసిపట్ల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ

20-01-2025 08:47:58 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): కన్నెపల్లి మండలంలోని జనకాపూర్ మాజీ ఎంపీటీసీ సభ్యులు సత్తయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో సోమవారం సాయంత్రం ఆయన కుటుంబ సభ్యులను పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ(MP Gaddam Vamsikrishna) పరామర్శించారు. ముసిపట్ల సత్తయ్య కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాధవరపు వెంకట నర్సింగరావు, మునిమంద రమేష్ లతో పాటు స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇటీవల అనారోగ్యంతో మరణించిన వెంకటాపూర్ మాజీ సర్పంచ్ గరిశెట్టి వెంకయ్య కుటుంబ సభ్యులను కూడా ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించి భరోసా అందించారు.