calender_icon.png 27 December, 2024 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాయామం చేసి.. ఆటలు ఆడి

08-11-2024 10:00:01 AM

మార్నింగ్ వాక్ లో ఎంపీ వంశీ కృష్ణ 

మంచిర్యాల, విజయక్రాంతి : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంచిర్యాలలోని జడ్పిహెచ్ఎస్ (జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్) గ్రౌండ్‌లో శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్ చేశారు. వాకర్స్ తో కలిసి వ్యాయామం చేస్తూ సమస్యలను, ప్రభుత్వ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వాకర్స్ తో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని, ప్రతిరోజు ఉదయం వ్యాయామం చేయాలని, దీనితో మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడం వలన అనేక రకాల శారీరక, మానసిక ప్రయోజనాలు ఉంటాయని వివరించారు.

క్రీడలు ఆడి.. ఉత్తేజపరిచి...

మార్నింగ్ వాక్ చేసిన అనంతరం పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి, బాక్సింగ్ చేశారు.  క్రీడాకారులను కలిసి వారి క్రీడా అభిరుచులను ప్రోత్సహిస్తూ, వారికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన కోసం తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. గ్రౌండ్‌లో అవసరమైన సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. కొద్దిసేపు క్రికెట్ ఆడీ క్రికెటర్లలో ఉత్తేజాన్ని నింపగా, ఆ తర్వాత బాక్సింగ్ క్రీడాకారులతో కూడా కొద్దిసేపు బాక్సింగ్ చేశారు.