calender_icon.png 7 November, 2024 | 11:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాపల్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఎంపీకి వినతి

03-11-2024 04:25:44 PM

మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలోని యాపల్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించి పట్టణ ప్రజల ఇబ్బందులు తొలగించాలని నేషనల్ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కు వినతిపత్రం అందజేశారు. శనివారం రాత్రి పట్టణానికి వచ్చిన ఆయనకు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా అంబేద్కర్ సేన జాతీయ ప్రధాన కార్యదర్శి తుంగపిండి రాజేష్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలో ప్రధాన రహదారి ఏర్పాటుతో ఎర్రగుంటపల్లి, యాపల్, రామలయం, పోషమ్మ బస్తీ, అంగడిబజార్, సెగ్యం బస్తీ వాసులు బెల్లంపల్లి, కాగజ్ నగర్, ఆసిఫాబాద్ వంటి పట్టణాలకు వెళ్లేందుకు రోడ్డు దాటడానికి ఎలాంటి సౌకర్యం లేక పోవడంతో ప్రజలు మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీలు, విద్యార్థులు  ప్రయాణాలకు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వెంటనే యాపల్ బస్ స్టాప్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి (వంతెన) ఏర్పాటు చేసి ప్రయాణీకుల ఇబ్బందులు తొలగించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎంపీ గడ్డం వంశీ త్వరలోనే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పసుపునూటి రమేష్, జిల్లా ముఖ్య సలహాదారు తుంగ పిండి రాము, జిల్లా కోఆర్డినేటర్ గోర్కాటి సురేష్, మండల అధ్యక్షులు జూల శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి కొలిపాక సాంబయ్య, మండల ప్రధాన కార్యదర్శి దుడపాక శ్రీనివాస్ లు పాల్గొన్నారు.