calender_icon.png 12 January, 2025 | 6:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీ రాంభువల్ అనర్హుడు

29-07-2024 01:58:09 AM

రాంభువల్ నిషాద్ అఫిడవిట్‌లో అవాస్తవాలు

అలహాబాద్ హైకోర్టులో మేనకా గాంధీ పిటిషన్

ఈనెల 30న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

లక్నో, జూలై 28 : లోక్‌సభ ఎన్నికల్లో తన ప్రత్యర్థి గెలుపును సవాల్ చేస్తూ బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి మేనకాగాంధీ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి తనపై గెలిచిన సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి రాంభువల్ నిషాద్ ఎన్నికల అఫిడవిట్‌లో అవాస్తవాలు పేర్కొన్నాడని ఆమె తన పిటిషన్‌లో ఆరోపించారు. తనపై ఉన్న క్రిమినల్ కేసులను ఆయన దాచిపెట్టాడని స్పష్టం చేశారు. అన్నుల్ నిషాద్‌పై మొత్తం 12 క్రిమినల్ కేసులు ఉన్నాయని, కానీ తన నామినేషన్ పత్రాల్లో ఆయన తనపై 8 క్రిమిల్ కేసులు మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారని గుర్తు చేశారు.

గోరఖ్‌పూర్ జిల్లాలోని ప్రిప్రైచ్ పోలీస్ స్టేషన్, బర్హల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసుల సమాచారాన్ని దాచిపెట్టడాని ఆరోపించారు. వాస్తవాలు దాటిపెట్టి ఎన్నికల్లో గెలిచిన అన్నుల్ నిషాద్‌పై అనర్హత వేటు వేసి.. రెండో స్థానంలో నిలిచిన తనను ఎంపీగా ప్రకటించాలని ఆమె కోరారు. మేనకా గాంధీ పిటిషన్ స్వీకరించిన లక్నో బెంచ్ ఈనెల 30న విచారణ చేపట్టనుంది. కాగా, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మేనకా గాంధీ తన సిట్టింగ్ స్థానమైన సుల్తాన్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు. సమాజ్‌వాదీ పార్టీ ఆమెపై రాంభువల్ నిషాద్‌ను పోటీకి దింపింది. ఈ ఎన్నికల్లో అన్నుల్ నిషాద్ మేనకా గాంధీపై 43,174 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.  నిషాద్‌కు 4,44,330 ఓట్లు రాగా, మేనకా గాంధీకి 4,01,156 ఓట్లు వచ్చాయి.