24-04-2025 12:17:31 AM
దంసలాపురం రైల్వే అండర్ బ్రిడ్జికి
నిధులు ఇచ్చేందుకు రైల్వే జి.యం హామీ
ఖమ్మం, ఏప్రిల్ 23( విజయక్రాంతి ):-ఖమ్మం రైల్వే సమస్యల పరిష్కారానికి ఎంపీ రఘురాంరెడ్డి ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. దంసలాపురం రైల్వే అండర్ బ్రిడ్జి, సర్వీ స్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి గతంలో సర్వే పూర్తయినప్పటికీ భూసేకరణకు నిధులు మంజూరు చేయకపోవడంతో అండర్ బ్రిడ్జి నిర్మాణం ఆగిపోయింది.దీంతో స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని గుర్తించిన ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి ఇటీవల ధంసలాపురం అండర్ బ్రిడ్జి నిర్మాణ ప్రాంతాన్ని రైల్వే అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు అండర్ బ్రిడ్జి, సర్వీస్ రోడ్డు నిర్మాణం, చేపట్టకపోవడంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని ఎంపీ కి చెప్పారు.
కాగా ఈ విషయమై బుధవారం ఎంపీ, సికింద్రాబాద్ రైల్వే జీఎం నీ కలసి దంసలాపురం అండర్ బ్రిడ్జి, సర్వీస్ రోడ్డు నిర్మాణం భూసేకరణకు కొరకు నిధులు మంజూరు చేయాలని ఎంపీ కోరగా రైల్వే జీఎం సానుకూలంగా స్పందించిన నిధుల మంజూరు కి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సంద ర్భంగా గతం లో రద్దు చేసిన రైళ్లను తిరిగి పున:రుద్దరించాలని కోరారు. ఖమ్మం, బోనకల్, ఎర్రుపాలెం, డోర్నకల్ నుండి భద్రాచలం రోడ్డు వెళ్ళే మార్గంలో గాంధీనగర్ స్టేషన్ లో రైళ్లను నిలుపుదల చేయాలని రైల్వే జీఎంని కోరగా సానుకూలంగా స్పందించారు.అదేవిధంగా ఇంతకముందు ప్రతిపాదించిన డోర్నకల్ -మిర్యాలగూడెం, డోర్నకల్-గద్వాల రైల్వే లైన్ అలైన్మెంట్ మార్చి డోర్నకల్-వెన్నారం మరిపెడ మోతే ద్వారా వెళ్ళటానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఎంపీ రైల్వే జీయం ను కోరారు.