calender_icon.png 4 April, 2025 | 1:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోగులకు అండగా ఎంపీ రఘునందన్ రావు

27-03-2025 12:36:18 AM

గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ ను ప్రారంభించిన బిజెపి నాయకులు 

గజ్వేల్, మార్చి 26 : పేద రోగులకు అండగా ఎంపీ రఘునందన్ రావు నిలిచారని, ఆయన గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ అందజేయడం సంతోషంగా ఉందని రాష్ట్ర నాయకులు ఎల్లు రాంరెడ్డి,   బిజెపి సీనియర్ నాయకులు జశ్వంత్ రెడ్డి, బండారు మహేష్ లు అన్నారు. బుధవారం గజ్వేల్ ప్రభుత్వ దావఖానలో ఎంపీ రఘునందన్ రావు అందించిన అంబులెన్స్ ను వారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ ను అందించినందుకు ఎంపీ రఘునందన్ రావు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ఉప్పల మధుసూదన్, పెండ్యా ల శ్రీనివాస్, బారు అరవింద్, మహిళా మో ర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు.