హైదరాబాద్,(విజయక్రాంతి): గ్రామపంచాయతీలను రాష్ట్రప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. గ్రామపంచాయతీల్లో విద్యుత్ బిల్లులు కట్టలేని పరిస్థితి ఉందని, పల్లె ప్రగతికి విడుదల చేయాల్సిన నిధులు చేయట్లేదని ఆయన కాంగ్రెస్ ప్రబుత్వంపై ఆరోపణలు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో అప్పులు తీసుకుని ఇబ్బందులకు గురవుతున్నారని పంచాయతీ కార్యదర్శిలు అంటున్నారన్నారు. పంచాయతీలను తగ్గించి అర్బన్ డెవలప్ మెంట్ పేరుతో అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేందప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎక్కడికి పోతున్నాయి..? అని రఘునందన్ ప్రశ్నించారు.