calender_icon.png 8 January, 2025 | 7:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోట్టాపిస్ కేసులు అంటూ.. భయం ఎందుకు

07-01-2025 07:12:16 PM

జైల్లో కేటీఆర్ యోగ చేసుకోవడం తప్పదు...

మెదక్ ఎంపీ రఘునందన్ రావు విలేకరుల సమావేశంలో వెల్లడి.

మనోహరబాద్ (విజయక్రాంతి): లోట్టాపిస్ కేసులకు న్యాయవాదులు లేకుండా కేటీఆర్(KTR) ఏసీబి విచారణకు ఎందుకు వెళ్లడం లేదని మెదక్ ఎంపి రఘునందన్ రావు(MP Raghunandan Rao) హాట్ కామెంట్స్ చేశారు. మెదక్ జిల్లా మనోహరబాద్ మండల కేంద్రంలో పిహేచ్సి ఆసుపత్రిలో మంగళవారం మెదక్ ఎంపి రఘునందన్ రావు, సర్పంచుల ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నత్తి మల్లేష్ ముదిరాజ్, మాజీ ఎంపిపి పురం నవనీత రవి ముదిరాజ్, బీజేపీ నాయకులతో కలిసి 108 వాహనాన్ని ప్రారంభించారు. ఆసుపత్రిలో పలు రికార్డులను పరిశీలించి చికిత్స కోసం వచ్చిన రోగుల సదుపాయాలు, వైద్య సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా ఎంపి రఘునందన్ రావు మాట్లాడుతూ.. సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ కు సిద్ధం మొదలైందని ఏసీబి చేపట్టే విచారణన లోట్టాపిస్ కేసు అంటూ ఆరోపించిన కేటీఆర్ అవినీతికి పాల్పడకపోతే ఇప్పుడు న్యాయవాదులు లేకుండా హాజరు కాను అనడం విడ్డురంగా ఉందన్నారు. అవినీతికి పాల్పడ్డ కేటీఆర్ జైలుకు వెళ్లి యోగ చేసుకోవడం తప్పదని విమర్శించారు. గతంలో పోలీసుల పనితీరు భేష్ అని ప్రస్తుతం పోలీసులపై మండిపడడం సరికాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఐలయ్య, ఫొటోళ్ల వెంకటేష్ గౌడ్, బీజేపీ నాయకులు అజయ్ కుమార్, వైద్య సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.