సంగారెడ్డి(విజయక్రాంతి): బీజేపీ(BJP) నేత, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు(MP Raghunandan Rao)ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వెలిమల తండా(Velimela Thanda)లో రఘునందన్‌రావును అదుపులోకి తీసుకొని పటాన్‌చెరు పోలీస్ స్టేషన్(Patancheru Police Station)కు తరలించారు. వెలిమల భూ వివాదంపై గిరిజనులు గత పది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. నిన్న గిరిజనులకు బీజేపీ అండగా నిలుస్తుందని పార్టీ ఆఫీసులో ప్రకటించారు. ఇవాళ ఉదయం నుంచి గిరిజనులకు మద్దతుగా పార్టీ శ్రేణులతో కలిసి ఎంపీ రఘునందన్‌రావు ఆందోళనల్లో పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి వెలిమల తండా నుంచి సదరు భూముల వరకు ర్యాలీ నిర్వహించారు. దీంతో ఇవాళ సాయంత్రం ఎంపీ రఘునందన్ ను అరెస్టు చేస్తున్న సమయంలో గిరిజనులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆందోళనకారులకు పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది.