27-03-2025 11:29:57 PM
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల కోరిక ఆయిన విమానాశ్రయం మంజూరు చేయాలని ఎంపీ గోడం నగేష్ కోరారు. విమానాశ్రయం గురించి గురువారం పార్లమెంట్ సమావేశంలో ఆయన ప్రస్తావించారు. కేంద్ర విమానయాన మంత్రి ఇటీవల మాట్లాడుతూ.. ఆదిలాబాద్ విమానాశ్రయం వ్యూహాత్మకమైన ప్రాంతమని, తెలంగాణ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, చత్తీస్గడ్ రాష్ట్రాలకు ఎంతో ఉపయోగమని అన్నారని ఎంపీ గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఫీజిబిలిటీ రిపోర్ట్ ను తెప్పించి విమానాశ్రయం మంజూరు చేయాలని కోరారు.