calender_icon.png 10 January, 2025 | 3:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలి

04-01-2025 09:03:57 PM

బైంసా,(విజయక్రాంతి): విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకొని ఆటల పోటీల్లో రాణించాలని ఆదిలాబాద్ ఎంపీ నగేష్ అన్నారు. బైంసా సరస్వతి శిశు మందిర్లో శనివారం ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ తో కలిసి విభాగ్ కేల్ కూల్ పోటీలను ప్రారంభించారు. ఆటల పోటీలు విద్యార్థుల్లో శారీరక మానసిక వికాసాన్ని పెంపొందిస్తాయన్నారు. శిశు మందిరాలు విద్యతోపాటు ఆటల పోటీలకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చి విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయని అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దామోదర్ రెడ్డి, శిశు మందిర్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.