calender_icon.png 13 February, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విన్ కుమార్ ను కలిసిన ఎంపీ నగేష్

13-02-2025 08:05:08 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని కుమార్(Union Railway Minister Ashwini Kumar) ని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్(MP Godam Nagesh) గురువారం కలిశారు. ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం(Adilabad Parliamentary Constituency) పరిధిలోని పలు అభివృద్ధి పనుల గురించి వినతిపత్రాలు ఇచ్చారు. ఆర్మూర్ నుండి అదిలాబాదు వరకు రైల్వే లైన్ సర్వే పనులు పూర్తి అయ్యాయని, డి.పి.ఆర్(DPR) అంచనాలను సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుండి తెప్పించి త్వరలో మంజూరు ఇవ్వాలని కోరారు. రెబ్బెన వద్దగల ఎల్సి 71 ఆర్ఓబి టెండర్ లు పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు.

కాజీపేట నుండి హౌరా పెద్దపల్లి మంచిర్యాల కాగజ్ నగర్ మీదుగా కొత్త రైలు వేయాలని, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్(Bhagyanagar Express) ను సిర్పూర్ (టీ) వరకు పొడిగించాలని కోరారు. అదేవిధంగా నాందేడ్ నుండి కొన్ని రైళ్లను అదిలాబాద్ వరకు పొడిగించాలని, కాగజ్ నగర్ స్టేషన్ ను అమృత్ పథకం(AMRUT Scheme)లో చేర్చి అభివృద్ధి పనులు చేపట్టాలని విన్నవించారు. బాసర, రెబ్బెన, కాగజ్ నగర్ స్టేషన్ లలో పలు రైళ్లకు స్టాప్ ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.