calender_icon.png 11 February, 2025 | 11:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్.హెచ్.ఏ.ఐ చైర్మన్ ను కలిసిన ఎంపీ నగేష్...

11-02-2025 06:55:38 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్.హెచ్.ఏ.ఐ) చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ తో పాటు విశాల్ చౌహన్ ను ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ కలిశారు.  ఇటీవల టోల్ ప్లాజా యూనియన్ నాయకులు, ఉద్యోగస్తులు ఎంపీని కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మంగళవారం మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి ఎన్.హెచ్.ఏ.ఐ చైర్మన్ ను ఆదిలాబాద్ ఎంపీ కలిశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గము పరిధిలోని గంజాల, రోల్ మామడ, పిప్పర్ వాడా టోల్ ప్లాజులలో పనిచేస్తున్న ఉద్యోగస్తులను ఎవరిని తొలగించవద్దని కోరారు. నూతనంగా టోల్ ప్లాజా టెండర్ దక్కించుకున్నా కంపనీలు పాత వారిని తోలగించకుండా, కొత్త ఉద్యోగులను నియమించకుండా చూడాలని చైర్మన్ ను ఎంపీ కోరారు. దీనికి చైర్మన్ సానుకూలంగా స్పందించారని ఎంపీ నగేష్ తెలిపారు.