18-04-2025 12:00:00 AM
ఆదివాసుల సమస్యలపై గవర్నర్‌కు వినతి
ఆదిలాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి) : రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ కలిసారు. హైదరా బాదులో గురువారం జిల్లాకు చెందిన ఆదివాసీలతో గవర్నర్‌ను కలిసిన ఎంపీ శాలు వా పూలబొకేతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతంలోని సివిల్ కేసుల అధికారం ఐటీడీఏ పీవో లకే ఉండాలని, రాష్ట్ర గిరిజన సలహా మండలి సమావేశం జరపాలని కోరారు.
ఐటిడిఏ గవర్నమెంట్ బాడీ సమావేశాలు జరుపుటకు రాష్ట్ర ప్రభుత్వానికి తగు ఆదేశాలు జారీ చేయాలని విన్న వించారు. కార్యక్రమంలో సార్ మెడీ మెస్రం దుర్గు, పెందుర్ గోపి, పెందురు ప్రభాకర్, కొమరం అటల్ రావు, అరక వసంతరావు, గిరి, జమర్ తదితరులు ఉన్నారు.