calender_icon.png 23 November, 2024 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలు

22-11-2024 08:46:11 PM

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

మారుమూల గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కరువు

ఆదివాసి గూడల్లో పర్యటించిన ఎంపీ, ఎమ్మెల్యేలు

ఆదిలాబాద్,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ తోనే విద్య, వైద్య, ఉపాధి, అవకాశాల తో పాటు అభివృద్ధి సాధ్యమని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని మారుమూల ఆదివాసి గూడల్లో వారు శుక్రవారం పర్యటించారు. అదిలాబాద్ దివ్య గుడ, పొట్టాం లోద్ది గ్రామాల్లో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఎంపీ, ఎమ్మెల్యే లు ఆవిష్కరించారు.

అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ... జిల్లాలో గుండం లొద్ది  గ్రామం ఎక్కడ ఉందో చాలా మందికి తెలియదని, అలాంటి మారుమూల గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత, ప్రస్తుత రాష్ర్ట ప్రభుతాలు విఫలమైందన్నారు. మారుమూల ఆదివాసి గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుతం ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. చించు ఘాట్ నుంచి గుండం లొద్ది గ్రామం వరకు బీటి రోడ్డు అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని, త్రీ ఫేస్ కరెంటు లేక సాగునీటి సౌకర్యానికి నోచుకోలేకపోతున్నామని దీనిపై ఎంపీ, ఎమ్మెల్యే లు ప్రత్యేక దృష్టి సారించారని గ్రామస్తులు కోరారు.

రాబోయే నాలుగు సంవత్సరాలలో గ్రామంలో ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని వారు అన్నారు. గతంలో ఓట్ల కోసం వచ్చిన నేతలు గెలిచిన తరాత తిరిగి మళీ ముఖం చూపించే వాళు కాదని, ఇప్పుడేం ఎన్నికలు లేవు కేవలం గిరిజన గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుతం ప్రత్యేక పథకం కింద లక్షల నిధులు మంజూరు చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంతోష్, దయాకర్, సామి, ముకుందరావు, రాజు, తుకారం తదితరులున్నారు.