calender_icon.png 26 January, 2025 | 12:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే

25-01-2025 12:00:00 AM

ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రూపేష్

నారాయణఖేడ్, జనవరి 24: నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని నాగల్ గిద్ద మండలం మోర్గి చౌరస్తాలో నూతన పోలీస్ స్టేషన్ ను  జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, జిల్లా ఎస్పీ రూపేష్ లు శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కర్ణాటక ప్రాంతాలకు సరిహద్దు ప్రాంతంగా ఉన్న నాగలగిద్ద పోలీస్ స్టేషన్ ఎంతో కీలకమని అన్నారు.

తాము అధికారంలోకి రాగానే పోలీస్ స్టేషన్ నిర్మాణం కు తగు నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. నూతన భవన నిర్మాణంతో పోలీసుల సమస్యలు తీర డం జరిగిందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మొర్గి ప్రాంతంలో త్వరలోనే ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటామని అన్నారు.

దీంతో స్థానికులకు యువకులకు ఉపాధి అవకాశాలు లభించడం జరుగుతుందన్నారు. స్థల సేకరణకు సంబంధించి రెవెన్యూ అధికారులకు తగు సూచనలు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సంజీవరావు, స్థానిక డిఎస్పి వెంకటరెడ్డి, సీఐ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక పోలీస్ సిబ్బంది ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.