హైదరాబాద్,సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : రాష్ట్రంలో భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలతో అల్లాడుతున్న రాష్ట్రంలోని బాధితులను ఆదుకోవడానికి సీఎం సహాయ నిధికి నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి ఒక నెల వేతనం రూ. 1 లక్షా 90 వేలను విరాళంగా అందజేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు స్పందించిన ఆయన ఎంపీ నెల వేతనానికి సంబంధించిన చెక్‌ను ఇచ్చారు.