calender_icon.png 28 November, 2024 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామగుండంలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేయాలి

28-11-2024 04:30:29 PM

కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడుకు పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ఞప్తి 

పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేయాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఢిల్లీలో కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడును కోరారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ... పారిశ్రామిక రామగుండం ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని, రామగుండం ఏరియాలో కొత్తగా ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాంత యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఇప్పటికే రామగుండంలో ఎన్టీపీసీ, బసంత్ నగర్, కేశోరం సిమెంట్ ఫ్యాక్టరీ, ఆర్ఎఫ్సీఎల్, గోదావరిఖనిలో సింగరేణి కోల్ మైన్స్ తో పాటు అనేక సహజ, మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని, ఎయిర్ పోర్ట్ ఏర్పాటు తో వీటికి సంబంధించిన కొత్త పరిశ్రమలు ఏర్పాటుకు విస్తారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. రామగుండంలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాలకు చెందిన వేలాదిమంది ప్రజలు స్థిరపడ్డారని, వ్యాపారం వాణిజ్యం ఉన్నత చదువుల కోసం మెరుగైన రవాణా వ్యవస్థను కోరుకుంటున్నారని,  కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లమని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు.