calender_icon.png 21 February, 2025 | 7:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు నష్టపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు

19-02-2025 02:24:03 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు(MLC Elections)  ఫిబ్రవరి 27వ తేదిన జరగనున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. వరంగల్-హనుమకొండలోని పలు కళాశాలలలొ ఉపాధ్యాయులను, ఉపాధ్యాయ సంఘాలను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్(MP Etela Rajender) బుధవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉమ్మడి వరంగల్ - ఖమ్మం - నల్గొండ నియోజకవర్గ బీజేపీ బలపరచిన ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి(BJP MLC candidate Puli Sarotham Reddy) తరుపున ఎన్నికల ప్రచారం చేశారు.

ఓటర్లు తమ మొదటి ప్రాధాన్యత ఓటును పులి సరోత్తం రెడ్డికి వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్ధించారు. గ్రీన్ ఫీల్డ్ భూ సేకరణలో రైతులు తీవ్రంగా నష్టపోతుంటే రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఈటెల ఆరోపించారు. రైతుల తరపున పోరడేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని హెచ్చరించారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సర్కార్ పట్టించుకోవడం లేదని, రైతాంగాన్ని ప్రభుత్వం అదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాభివృద్ధికి బీజేపీ వ్యతిరేకం కాదని, నేషనల్ హైవే కోసం సేకరించే భూములను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని.. ఇందుకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.