calender_icon.png 22 January, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణమాఫీ నిబంధనలే రైతుకు ఉరితాడు : ఈటల

16-07-2024 05:04:05 PM

హైదరాబాద్ : ఐదేళ్ల అధికారం ఉంది.. ఏమైనా చేయవచ్చన్న అహం ముఖ్యమంత్రికి ఉందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ ను ఓడించాలని అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ బహిరంగ సభల్లో కిసాన్, యువ, దళిత పాలసీలు ప్రకటించిందన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల ముందు హామీ ఇచ్చిందని ఈటల దుయ్యబట్టారు. రుణమాజీ కావాలంటే తెల్లరేషన్ కార్డు ఉండాలని నిబంధన పెట్టారని, పదేళ్ల నుంచి తెల్లరేషన్ కార్డులు మంజూరు చేయలేదని, దరఖాస్తులు తీసుకొని 7 నెలలయినా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రుణమాఫీ చేస్తామని దేవుళ్లు, సోనియా మీద ప్రమాణం చేశారు. అడ్డదారులు తొక్కి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. రుణమాఫీ నింబధనలే రైతుకు ఉరితాడని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం నిబంధనలు ప్రకారం దేశవ్యాప్తంగా కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తుందని, రైతులకు మద్దతు ధరలను రెట్టింపు చేసిందని చెప్పారు. విశ్వసనీయత లేని నాయకుడు అని కేసీఆర్ ను బొద పెట్టి తెలంగాణ ప్రజలను మరోసారి మోసగించారని ఈటల పేర్కొన్నారు.