11-03-2025 12:31:17 AM
మేడ్చల్, మార్చి 10 (విజయ క్రాంతి): మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులతో సహా ప్రధాని నరేంద్ర మోడీని సోమవారం కలిశారు. కొద్దిసేపు ఆయనతో ముచ్చటించారు. తర్వాత లోక్సభ స్పీకర్ హోమ్ బిర్లా ను కూడా కలిశారు. ఈటల రాజేందర్ ప్రధానిని కలవడం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.