01-03-2025 07:11:15 PM
నిర్మల్,(విజయక్రాంతి): మార్చి 31 లోపు పెండింగ్లో ఉన్న పన్నులను చెల్లించాలని ఎంపీ ఈవో సాగర్ రెడ్డి(MP EO Sagar Reddy) అన్నారు. శనివారం మండల కేంద్రంలో పన్నుల వసూళ్లకు సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. త్రెడ్ లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలని, అన్ని రకాల పనులను చెల్లించి అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు, వ్యాపారస్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి సిబ్బంది పాల్గొన్నారు.