హైదరాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయట్లేదని బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత నెరవేర్చిన ఎన్నికల హామీలపై చర్చించుదకు తను సిద్ధమని, ఎన్నికల హామీలు నెరవేర్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో నిరూపిస్తే రాజకీయాల నుంచి తను శాశ్వతంగా తప్పుకుంటన్నాని ఈటల సవాల్ చేశారు. 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అర్హులందరికీ ఇవ్వట్లేదని, గ్యాస్ సిలిండర్ రాయితీ అందరికీ వర్తింపచేయట్లేదని ఈటల రాజేందర్ మండిపడ్డారు.