calender_icon.png 21 January, 2025 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థిరాస్తి దళారిని చెంపదెబ్బ కొట్టిన ఎంపీ ఈటల రాజేందర్

21-01-2025 02:05:32 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): స్థిరాస్తి దళారి(Real Estate Agent)పై మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri BJP MP Etela Rajender) చేయు చేసుకున్నారు. మేడ్చల్‌లోని పోచారం మున్సిపాలిటీ ఏకశిలానగర్ లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు పేదలకు చెందిన భూమిని ఆక్రమించి వేధిస్తున్నారని తెలుసుకున్న రాజేందర్, పార్టీ నాయకులతో కలిసి పోచారం గ్రామానికి చేరుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో స్థిరాస్తి దళారి(Real Estate Agent)పై ఈటల ఆగ్రహం వ్యక్తం చేసి, చెంపదెబ్బ కొట్టారు. చెయి చేసుకోవడానికి ముందు ఈటల బ్రోకర్ తో సామదనంగా మాట్లాడారు. పార్టీ అనుచరులు, పేద ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఆ స్థలం నుండి వెళ్లిపోవాలని కోరారు. పార్టీ నాయకులు బ్రోకర్‌ను తన ప్రవర్తనను సరిదిద్దుకోవాలని, అదే తప్పు చేయవద్దని, లేకుంటే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పేద ప్రజలు, పార్టీ అనుచరులు ఎంతగా కోపగించుకున్నారంటే, రాజేందర్ చెంపదెబ్బ కొట్టిన తర్వాత అందరూ బ్రోకర్‌ను కొట్టారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ... పేదలు కొనుక్కున్న జగాలకు బీజేపీ అండగా ఉంటుందన్నారు.

కొందరు అధికారులు బ్రోకర్లకు కొమ్ముకాస్తున్నారని, భూములు కొనుక్కున్న పేదల సమస్యలపై జిల్లా కలెక్టర్, సీపీతోనూ మాట్లాడానన్ని తెలిపారు. కొందరు దొంగ పత్రాలతో పేదల భూములు లాక్కుంటున్నారని,  బ్రోకర్లకు సహకరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళారులతో పోలీసులు, అధికారులు కుమ్మక్కై పేద ప్రజల భూములు లక్కుంటున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు.  అరుంధతీనగర్, బాలాజీ నగర్, జవహర్ నగర్ లోనూ ఇదే సమస్య ఉందని, 40,50 గజాలు కొనుక్కున్న పేదల షెడ్లు కూల్చుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూల్చివేతలు తప్ప.. పేదల కన్నీళ్లు పట్టించుకోవట్లేదని విమర్శించారు. తమపై గుండాలు దౌర్జన్యం చేస్తున్నారని పేదలు ఆయనతో వాపోతున్నారని, రోజురోజుకు తామ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని పేదలు కన్నీరు పెడుతున్నారని చెప్పారు. ఏకశిలానగర్ లో 1985లో చిరుద్యోగులు ప్లాట్లు కొనుక్కున్నారు. నిన్న మొన్ననే వారికి నిర్మాణ అనుమతులు వచ్చాయని, కాంగ్రెస్ పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చాకే నిర్మాణాలకు అనుమతులు ఇవ్వట్లేదని పేర్కొన్నారు. ఏకశిలానగర్ లో ఇళ్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకుంటుందని ఎంపీ ఈటెల ఆరోపించారు.